: ఉల్లిపాయల కోసమూ ఆధార్ కార్డు... కొయ్యకుండానే కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి!


"ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు" అంటారు. ఉల్లి లేనిదే వంటకం ఉండదు, భోజనం ఉండదు. అటువంటి అత్యవసర నిత్యావసర ఆహార పదార్థాల జాబితాలోని ఉల్లి ధర ఆంధ్రప్రదేశ్ లో చుక్కలను తాకుతోంది. కొయ్యకుండానే కంట నీరు తెప్పిస్తోంది. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు కిలోకు రూ. 40 నుంచి రూ. 50కి చేరుకున్నాయి. ప్రజల అవస్థలు చూడలేక చంద్రబాబు ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా కిలో రూ. 20కి అమ్మించాలని తలపెట్టినా, ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు. ఉల్లిపాయలు కావాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందేనని రైతుబజార్ అధికారులు లంకె పెట్టడంతో తలపట్టుకుంటున్నారు. గంటల కొద్దీ లైన్లో నిలుచుంటే రెండు కిలోల ఉల్లిపాయలు ఇస్తున్నారని, వాటిల్లో సగం పాడైపోయినవే ఉంటున్నాయని ప్రజలు వాపోతున్నారు. కాగా, విజయవాడ బందరురోడ్డులోని రైతుబజార్ వద్ద రెండు కిలోమీటర్ల మేరకు ఈ 'ఉల్లి లైన్' కొనసాగుతున్నట్టు సమాచారం. మరోవైపు ఏలూరులోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News