: బాంబు ఉందన్న సమాచారంతో బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం దించివేత
సుమారు 300 మందికి పైగా ప్రయాణికులు, 17 మంది సిబ్బందితో వెళ్తున్న ఆ విమానంలో బాంబు ఉందన్న సమాచారం విమానాశ్రయ అధికారులకు చమటలు పట్టించింది. లాస్ వెగాస్ నుంచి లండన్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో బాంబు ఉన్నట్టు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని అధికారులు మాంట్రియల్ కి మళ్లించారు. ఈ విమానంలో 312 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. విమానాన్ని తనిఖీలు చేస్తున్న అధికారులు, ప్రయాణికులకు సమీపంలోని హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు. వీరందరినీ సాధ్యమైనంత త్వరలో, ఇతర విమానాల్లో గమ్యస్థానాలకు చేరుస్తామని వివరించారు.