: చంద్రబాబు పాలనను కేసీఆర్ పాలన తలపిస్తోంది: కోమటిరెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. తీవ్రమైన కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారిని నానా విధాలుగా వేధిస్తోందని ఆయన అన్నారు. కరెంటు బిల్లులను చెల్లించలేదనే సాకు చూపి, రైతుల మోటార్లను, స్టార్టర్లను లాక్కుంటున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు కూడా రైతులను ఇదే విధంగా వేధించారని... కేసీఆర్ పాలన చంద్రబాబు పాలనను తలపిస్తోందని దుయ్యబట్టారు. రైతుల కరెంట్ బకాయిలను వెంటనే మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో తుది దశలో ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ. వెయ్యి కోట్లను విడుదల చేయాలని కోరారు.