: త్వరలో ఢిల్లీలో వైఎస్ జగన్ ఆమరణ దీక్ష
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో ఢిల్లీలో దీక్ష చేయబోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ దీక్ష చేబడుతున్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన వైసీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10నగానీ, ఆగస్టు 15 తరువాతగానీ జంతర్ మంతర్ వద్ద జగన్ దీక్ష చేసే అవకాశం ఉంది.