: వీఐపీలు వెళ్లిన తరువాత పోలీసులకు తీవ్ర ఇబ్బందులు!


మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం అంత్యక్రియలు ముగిసిన తరువాత పోలీసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రధాని, పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లేంత వరకూ అదుపులోనే ఉన్న పరిస్థితి, ఆపై ఒక్కసారిగా అదుపుతప్పింది. ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు వేలాది మంది ఒక్కసారిగా దూసుకువచ్చారు. అక్కడ ఉన్న పోలీసులు, సైనిక సిబ్బంది వీరిని అదుపుచేయలేక పోతున్నారు. బందోబస్తుకు వచ్చిన పోలీసుల్లో అత్యధికులు వీఐపీలతో పాటే వెళ్లిపోగా, మిగిలిన కొద్ది మందీ, కలాం అభిమానులను ఓ వరుసలో సమాధి వద్దకు పంపేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ దశలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ సమయంలో సైన్యం స్పందించి రోప్ పార్టీని రంగంలోకి దించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

  • Loading...

More Telugu News