: ఫోన్ ట్యాపింగ్ పై ముగిసిన వాదనలు... కోర్టు నిర్ణయం 4 గంటలకు వాయిదా
ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలాని, ఏపీ ప్రభుత్వం తరపున వేణుగోపాల్ వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టు తన నిర్ణయాన్ని ఈ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం రేపిన ఈ ట్యాపింగ్ కేసులో కాల్ డేటా సమాచారం ఇవ్వాలని తమను ఆదేశించే అధికారం విజయవాడ కోర్టుకు లేదని టి.ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపైనే నేడు వాదనలు జరిగాయి.