: ముంబయి చేరుకున్న మెమన్ మృతదేహం
ముంబయి వరుస పేలుళ్ల కేసు దోషి యాకుబ్ మెమన్ మృతదేహం ముంబయి చేరుకుంది. అక్కడి నుంచి అంత్యక్రియలు జరగనున్న మెరైన్ లైన్ వద్దకు తీసుకువెళ్లనున్నారు. అయితే మెమన్ మృతదేహాన్ని ఊరేగింపుగా కుటుంబ సభ్యులు తీసుకువెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. మరోవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెమన్ ఇంటి దగ్గర, ముంబయిలో 200 మంది పోలీసులతో భారీ భద్రత చేపట్టారు. అటు ముంబయిలో 144 సెక్షన్ విధించారు. మెమన్ మృతదేహాన్ని ఖననం కోసం తీసుకువెళుతున్న సమయంలో ఫోటోలుగానీ, వీడియోగానీ తీయడానికి వీల్లేదని ముంబయి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.