: సోదరుడు సులేమాన్ ను చూసి కన్నీరు కార్చిన మెమన్


ఈ ఉదయం యాకుబ్ మెమన్ కు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ నేపథ్యంలో, మెమన్ ను ఆయన కుటుంబ సభ్యులు నిన్న నాగపూర్ సెంట్రల్ జైల్లో కలిశారు. ఈ సందర్భంగా, తన సోదరుడు సులేమాన్ ను చూసి మెమన్ కన్నీరు కార్చారని జైలు అధికారులు ఈరోజు తెలిపారు. అంతేకాకుండా, తాను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని తోటి ఖైదీలను, జైలు అధికారులను కోరాడని వెల్లడించారు. మరోవైపు, ఉరి ఖరారు కావడంతో, మెమన్ కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్లు వచ్చారని... ఈ సందర్భంగా, తన ఆరోగ్య పరిస్థితి బాగుందని, ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదని డాక్టర్లకు చెప్పినట్టు వారు తెలిపారు.

  • Loading...

More Telugu News