: మళ్లీ కాంగ్రెస్ గూటికి జగ్గారెడ్డి
మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ సొంతగూటికి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో, కాసేపట్లో ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఇరు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కలవనున్నారు. మెదక్ ఉపఎన్నిక సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ధైర్యంగా ఎదుర్కోగల సమర్థత ఉన్న జగ్గారెడ్డి... మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరనుండటంతో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.