: భారత్ లో జన విస్ఫోటం... అంచనాలకన్నా ముందుగానే చైనా జనాభాను అధిగమిస్తుందన్న యూఎన్


మన దేశ జనాభా జెట్ స్పీడుతో పెరుగుతోంది. ఎంతగా పెరుగుతోందంటే... రెండేళ్ల క్రితం వేసిన అంచనాలు సైతం తలకిందులయ్యేంతగా! ఐక్యరాజ్య సమితి (యూఎన్) అంచనాల ప్రకారం ప్రస్తుత భారత్ జనాభా 130.10 కోట్లుగా ఉండగా, చైనా జనాభా 130.80 కోట్లుగా ఉంది. మరో ఏడేళ్లలో రెండు దేశాల జనాభా 140 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితికి చెందిన 'డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్' తెలిపింది. 2022 నాటికి చైనా జనాభాను ఇండియా జనాభా అధిగమిస్తుందని ప్రకటించింది. రెండేళ్ల క్రితం వేసిన అంచనాల ప్రకారం 2028 నాటికి చైనా జనాభాను భారత్ అధిగమించాలి. కానీ, కేవలం రెండేళ్లలోనే తమ అంచనాలను ఐక్యరాజ్యసమితి సవరించుకోవాల్సి వచ్చింది. ఐరాస లెక్కల ప్రకారం... 2030 నాటికి మన దేశ జనాభా 150 కోట్లకు, 2050 నాటికి 170 కోట్లకు చేరుకుంటుంది. మరోవైపు, 2030 వరకు చైనా జనాభా 140 కోట్ల వద్ద స్థిరంగానే ఉంటుంది. కొంత తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఐరాస తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 730 కోట్లుగా ఉండగా, 2050 నాటికి 970 కోట్లకు చేరుకోబోతోంది. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ జనాభా 1120 కోట్లకు చేరుకోనుంది.

  • Loading...

More Telugu News