: మరో వ్యాపారంలోకి దిగుతున్న యువరాజ్ సింగ్!


ఇప్పటికే 'బ్యూటీ అండ్ వెల్ నెస్', 'ఎడ్యుకేషన్', 'లాజిస్టిక్స్' రంగాల్లో వ్యాపారాన్ని ప్రారంభించిన ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ కన్ను ఇప్పుడు ఆకాశంపై పడింది. ప్రైవేటు జెట్స్ అండ్ హెలికాప్టర్ సేవలందిస్తున్న 'జెట్ సెట్ గో' సంస్థలో ఆయన నిర్వహిస్తున్న 'యూ వుయ్ కెన్' సంస్థ పెట్టుబడులు పెట్టింది. అయితే, యువరాజ్ ఎంత పెట్టుబడి పెట్టారన్న విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకొని వచ్చిన తరువాత, యువరాజ్ క్రికెట్ ను కొనసాగిస్తూనే, ఆయన బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, జెట్ సెట్ గో సంస్థ హైఎండ్ కస్టమర్ల ప్రయాణ అవసరాలు తీరుస్తూ, వారికి ఆన్ లైన్ ద్వారా ప్రైవేటు జెట్ విమానాలను అద్దెకిస్తోంది. ఈ విభాగంలో మంచి వ్యాపార వృద్ధిని అంచనా వేసిన మీదటే యువరాజ్ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే ఎడ్యుకార్ట్, మొవ్వో, వ్యోమో సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News