: శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్... వాహనాల తనిఖీలో పోలీసులు, సీఐఎస్ఎఫ్
ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ కు ఉరి శిక్ష అమలుతో కేంద్రం దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో శంషాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ పోలీసులు భద్రతను పెంచారు. స్థానిక పోలీసులతో పాటు సీఐఎస్ఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. విమానాశ్రయానికి వెళుతున్న వాహనాలను భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. హైదరాబాదులోని సున్నిత ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు.