: యాకూబ్ మెమన్ భారత అధికారుల ఉచ్చులో పడ్డాడా?


1993 నాటి ముంబై పేలుళ్ల ఘటనలో నేడు ఉరితీయబడ్డ యాకూబ్ మెమన్ ను దర్యాప్తు అధికారులు మోసం చేశారా? వారిని నమ్మి లొంగిపోయేందుకు వచ్చి మెమన్ తప్పు చేశాడా? మెమన్ భారత అధికారుల ఉచ్చులో పడ్డాడా? ఈ ప్రశ్నలు నేటివి కాదు. ఇరవై ఏళ్లుగా నలుగుతున్నవే. బహిరంగ వేదికలపై ఎందరో దీన్ని చర్చించారు కూడా. పేలుళ్లకు రెండు రోజుల ముందు ముంబైని విడిచి వెళ్లిపోయిన మెమన్ కుటుంబానికి పాకిస్థాన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. వారికి మంచి ఇల్లు, తమ దేశపు పాస్ పోర్టులు, పిల్లలకు స్కూలు సర్టిఫికెట్లు అన్నీ ఇచ్చింది. అక్కడ ఉన్న ఏడాదిన్నర పాటూ యాకూబ్ లగ్జరీ జీవితాన్ని అనుభవించాడు. పాక్ పాస్ పోర్టుపై విదేశాలు తిరిగాడు. అదే సమయంలో యాకూబ్ కి కాంటాక్ట్ లోకి వెళ్లిన పేలుళ్ల కేసు దర్యాప్తు అధికారులు ఆయన్ను మభ్యపెట్టి, లొంగిపోతే ఎటువంటి శిక్షా లేకుండా చేస్తామని హామీలిచ్చి భారత్ కు రప్పించారన్న ఆరోపణలున్నాయి. ఆయనిచ్చిన సాక్ష్యాలను, పేలుళ్ల కుట్ర గురించి చెప్పిన వివరాలను అతనిపైనే ప్రయోగించినట్టు ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మెమన్ ఒకే ఒక్క టెలివిజన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది సీబీఐ కస్టడీలో ఉన్నప్పుడు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ సమయంలో దర్జాగా కుర్చీలో కూర్చుని ఏ మాత్రం బెరుకు లేకుండా మాట్లాడాడు. ఇంత పెద్ద కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న వ్యక్తి అలా కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారంటే, అధికారుల సహకారం లేకుండా సాధ్యమా? అన్న ప్రశ్న ఏనాడో ఉదయించింది. అంత పెద్ద క్రైమ్ వెనుక తన హస్తం కొంతైనా ఉందని ఓ టెలివిజన్ కెమెరా ముందు నిర్భయంగా ఒప్పుకున్నాడంటే, తదుపరి దశలో రక్షిస్తామన్న హామీ లేకుండా సాధ్యమా? అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీలను నమ్మి మెమన్ తప్పు చేశాడని అతని భార్య కూడా అభిప్రాయపడింది. వారిని నమ్మి ఇండియా వచ్చి ఉరికంబం ఎక్కాడని కొందరు భావించినా, జరిగింది చిన్న నేరం కాదు. నిందితులు ఒక రోజు తప్పించుకున్నా, ఏదోనాడు చట్టం ముందు నిలబడాల్సిందే.

  • Loading...

More Telugu News