: రామేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడులోని రామేశ్వరం చేరుకున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరుకావడానికి ఆయన రామేశ్వరం వెళ్లారు. ఇప్పటికే రామేశ్వరంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ లు ఉన్నారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా రామేశ్వరం చేరుకోనున్నారు. 11 గంటలకు అబ్దుల్ కలాం అంత్యక్రియలు ప్రారంభమవుతాయి.