: బర్త్ డే... డెత్ డే!: జన్మదినాన ఉరికంబమెక్కిన యాకుబ్ మెమన్


ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ తన జన్మదినాన్నే ఉరికంబమెక్కాడు. కాకతాళీయమే అయినా, కోర్టు ఆదేశాల మేరకు యాకుబ్ ను జైలు అధికారులు అతడి జన్మదినాన్నే ఉరి తీశారు. ఉరిని వాయిదా వేసుకునేందుకు యాకుబ్ చేసిన యత్నాలేవీ ఫలించలేదు. యాకుబ్ క్షమాభిక్ష పిటిషన్లపై విచారణ కోసం సుప్రీంకోర్టు తన చరిత్రలోనే తొలిసారిగా నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు వాదనలు విన్నది. యాకుబ్ పిటిషన్ విచారణార్హం కాదని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో నేటి ఉదయం తన జన్మదినాన యాకుబ్ ఉరికంబమెక్కాడు.

  • Loading...

More Telugu News