: యాకుబ్ ఉరి శిక్ష ఎవరి సమక్షంలో జరిగిందంటే...!
ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ కు నేటి ఉదయం 6.30 గంటలకు ఉరిశిక్ష అమలైంది. మహారాష్ట్ర నగరం నాగ్ పూర్ లోని సెంట్రల్ జైల్లో అధికారులు అతడిని ఉరి తీశారు. ఐదుగురు అధికారుల సమక్షంలో యాకుబ్ కు ఉరిశిక్ష అమలైంది. యాకుబ్ కు ఉరిశిక్ష ను ఖరారు చేసిన టాడా కోర్టు న్యాయమూర్తి, నాగ్ పూర్ జైలు సూపరింటెండెంట్, మహారాష్ట్ర సీఎం కార్యాలయ అధికారి, డీఐజీ స్థాయి పోలీసు అధికారి, యాకుబ్ కు వైద్య చికిత్స చేసిన వైద్యుల సమక్షంలో ఉరి శిక్ష అమలైంది. ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నట్లు సమాచారం.