: రాత్రి భోజనాన్ని నిరాకరించిన మెమన్... ఖాళీ కడుపుతోనే ఉరికంబమెక్కిన వైనం
ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్ కొద్దిసేపటి క్రితం ఉరి కంబంపై ప్రాణాలు ఒదిలాడు. కేసులో దోషిగా తేలిన యాకుబ్ కు మహారాష్ట్రలోని నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో నేటి ఉదయం 6.30 గంటలకు ఉరి శిక్ష అమలైంది. ఉరిశిక్ష అమలులో నాగ్ పూర్ జైలు అధికారులు నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేశారు. అతడు కోరినట్లు అతడి కూతురిని చూపించారు. అయితే నిన్న రాత్రి భోజనాన్ని యాకుబ్ మెమన్ తిరస్కరించాడట. తన ఉరి శిక్షపై రాత్రంతా హైటెన్షన్ కొనసాగిన నేపథ్యంలో యాకుబ్ కూడా తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం. ఈ కారణంగానే అతడు రాత్రి భోజనం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. రాత్రి భోజనం తీసుకోని మెమన్, ఖాళీ కడుపుతోనే ఉరి కంబమెక్కాడు.