: యాకుబ్ మెమన్ కు ఉరి శిక్ష అమలు
ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్ కు ఉరి శిక్ష అమలైంది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో కొద్దిసేపటి క్రితం యాకుబ్ కు ఉరి శిక్ష అమలైంది. ఉదయం 6.30- 7 గంటల మధ్య ఉరిశిక్ష అమలు చేయాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు నాగ్ పూర్ జైలు అధికారులు యాకుబ్ కు సరిగ్గా 6.30 గంటలకు ఉరి శిక్షను అమలు చేశారు. అర్ధరాత్రి ఒంటిగంటకే యాకుబ్ ను నిద్రలేపిన జైలు అధికారులు, ఆ తర్వాత నిబంధనల మేరకు ఉరి శిక్షను అమలు చేసేశారు.