: మరికాసేపట్లో యాకుబ్ మెమన్ కు ఉరి... నాగ్ పూర్ జైల్లో ఏర్పాట్లు పూర్తి


ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ మరికాసేపట్లో ఉరి కంబమెక్కనున్నాడు. ఉరి నిలుపుదలకు సంబంధించి అతడు చేసిన యత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్రపతి కూడా యాకుబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్లను తోసిపుచ్చారు. దీంతో నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో మరికాసేపట్లో అతడికి అధికారులు ఉరి శిక్ష అమలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సరిగ్గా నేటి ఉదయం 7 గంటలకు యాకుబ్ మెమన్ కు ఉరి శిక్ష అమలు కానుంది.

  • Loading...

More Telugu News