: మెమన్ ఉరిపై సుప్రీం తీర్పును స్వాగతించాలి: దత్తాత్రేయ
యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంతా స్వాగతించాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దేశ సమగ్రతకు సంబంధించిన అంశంలో రాజకీయాలకు స్థానం ఉండకూడదని అన్నారు. అటువంటి అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మెమన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఆయన తెలిపారు.