: కాసేపట్లో మెమన్ క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి నిర్ణయం
ముంబయి వరుస పేలుళ్ల కేసులో ఉరికంబం ఎక్కబోతున్న యాకూబ్ మెమన్ అత్యంత ఉత్కంఠ క్షణాలను అనుభవిస్తున్నాడు. మెమన్ క్షమాభిక్ష పిటిషన్ పై కాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన నిర్ణయం వెలువరించనున్నారు. ఈ విషయమై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాష్ట్రపతితో సమావేశమయ్యారు. మెమన్ పిటిషన్ ను తిరస్కరించాలని ఆయన రాష్ట్రపతికి సూచించనున్నట్టు సమాచారం. అటు, సుప్రీం కోర్టు మెమన్ కు ఉరిశిక్ష అమలు ఖరారు చేసిన నేపథ్యంలో ముంబయి, నాగ్ పూర్ నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముంబయిలో పోలీసులకు సెలవులు రద్దు చేశారు. పలువురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. అంతేగాకుండా, మెమన్ ఉరిశిక్షపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని మతపెద్దలకు స్పష్టం చేశారు.