: కలాంకు ఇష్టం ఉండదు...మెమన్ ఉరిపై ఆలోచించండి: రాష్ట్రపతిని కోరిన బెంగాల్ గవర్నర్
1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై మరోసారి ఆలోచించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పశ్చిమబెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ సూచించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఉరిశిక్ష అంటే ఇష్టం ఉండదని, అందుకోసమైనా యాకూబ్ మెమన్ పెట్టుకున్న ఉరిశిక్షను సమీక్షించాలని కోరారు. యాకూబ్ మెమన్ ఉరిశిక్షను రద్దు చేస్తే, కలాంకు ఘనమైన నివాళి అర్పించినట్టవుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, రేపు ఉదయం నాగ్ పూర్ జైలులో మెమన్ కు ఉరిశిక్ష అమలుకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.