: తహశీల్దార్ వనజాక్షి ఘటనపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం


కృష్ణాజిల్లా ముసునూరు మహిళా తహశీల్దార్ వనజాక్షి ఘటనపై ఏపీ ప్రభుత్వం ఈరోజు విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సీజే శర్మను నియమించింది. నెల రోజుల్లోగా ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల మొదట్లో కృష్ణాజిల్లాలో ఓ ఇసుక రీచ్ వద్ద ఇసుక రవాణాను అడ్డుకున్న వనజాక్షిపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనతో తీవ్ర కలకలం రేగడంతో విచారణ చేయించాలని ప్రతిపక్షాలు, రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News