: ఉరి శిక్షను ఎలా అమలు చేస్తారంటే...!


ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష ఖరారైంది. రేపు ఉదయం ఆయనను నాగ్ పూర్ జైల్లో ఉరితీయనున్నారు. ఈ నేపధ్యంలో ఉరి శిక్షపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు ఉరి శిక్షను ఎలా అమలు చేస్తారంటే... ఉరిశిక్ష అమలు చేసేందుకు ఒక అంగుళం (రెండున్నర సెంటీమీటర్లు) వ్యాసం, 19 అడుగుల పొడవు ఉండే రెండు తాళ్లను సిద్ధం చేస్తారు. ఖైదీ బరువుకు ఒకటిన్నర రెట్ల బరువుండే బస్తాలతో ఉరికి వారం రోజుల ముందే ఆ రెండు తాళ్లను పరీక్షించి లాక్ చేస్తారు. రేపు ఉరి అమలు చేస్తారనగా, జైలు సూపరిండెంట్ సమక్షంలో నేటి సాయంత్రం మరోసారి పరీక్షిస్తారు. ఉరి శిక్ష అమలు చేసే సమయంలో జైలు సూపరిండెంట్, జైలు వైద్యాధికారి, జిల్లా మేజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షులు ఉంటారు. ఉరితీసే సమయాలు నెలలను బట్టి మారతాయి. మే నుంచి ఆగస్టు వరకు ఉదయం 6 గంటలకు ఉరితీస్తారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే ఉదయం 8 గంటలకు ఉరితీస్తారు. మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రం ఉదయం 7 గంటలకు ఉరితీస్తారు. ఖైదీకి అర్థమయ్యే భాషలో అతనిని ఉరితీస్తున్నట్టు చెబుతారు. యాకూబ్ మెమన్ ఉరికి 22 లక్షల రూపాయలు కేటాయించారు. ఉరితీయడానికి సరిపడా ఫిట్ గా మెమన్ ఆరోగ్యంగా ఉన్నాడని జైలు వైద్యులు అధికారులకు ఇప్పటికే నివేదిక ఇచ్చారు.

  • Loading...

More Telugu News