: కలాం గురించి ఆయన బాల్యస్నేహితుడు ఏమన్నాడంటే...!
కలాం రాష్ట్రపతి అయ్యాక కూడా ఎంతో నిరాడంబరంగా ఉండేవారని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బాల్యస్నేహితుడు వెంకట సుబ్రమణియన్ శాస్త్రి అన్నారు. కలాం పార్థివ దేహం రామేశ్వరం చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "వందేళ్లు బతుకుతాడని అనుకున్నా, ఈ లోపే మరణించాడు" అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఎప్పుడు రామేశ్వరం వచ్చినా ఇంటికి వచ్చేవాడు, కుటుంబం బాగోగులు తెలుసుకునేవాడు. అంతా అయ్యాక నాతో ఫోటోలు దిగేవాడు. రాష్ట్రపతి అయ్యాక కూడా అంతే నిరాడంబరంగా ఉండేవాడు. కలాం రాష్ట్రపతిగా ఉండగా ఓ సారి ఢిల్లీ వెళ్లాను. అప్పుడు కూడా కుటుంబం గురించి, నా ఆరోగ్యం, బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నాడ"ని ఆయన గుర్తు చేసుకున్నారు.