: హుదుద్ బాధితులకు 10వేల ఇళ్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్


విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గతేడాది సంభవించిన హుదుద్ తుపానులో ఇళ్లు కోల్పోయిన వారికి ఏపీ ప్రభుత్వం 10వేల ఇళ్లు మంజూరు చేసింది. ఎన్టీఆర్ ప్రత్యేక గృహ నిర్మాణ పథకం కింద ఈ ఇళ్లు నిర్మించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో జీ ప్లస్ మోడల్ లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నట్టు పేర్కొంది. అదే విధంగా తుపాను బాధితులకోసం ప్రభుత్వానికి దాతలు ఇచ్చిన విరాళాలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్టు ప్రభుత్వం వివరించింది.

  • Loading...

More Telugu News