: ఎమ్మెస్వీ హనుమంతుడిలాంటి వాడు: రజనీకాంత్
ఇటీవలే కాలధర్మం చెందిన విఖ్యాత సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్ (ఎమ్మెస్వీ) ను దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ శ్లాఘించారు. ఎమ్మెస్వీ చాలామందికి ఓ హనుమంతుడిలా సాయం చేశారని, అదే సమయంలో ఉడుతలా సాధారణ జీవనం గడిపారని రామాయణంతో అన్వయిస్తూ చెప్పారు. సంగీత రంగంలో ఆయన మహనీయుడని కొనియాడారు. ఎమ్మెస్వీ ప్రతిభ భగవంతుడి వరప్రసాదమని పేర్కొన్నారు. దేవుని ఆశీస్సులు మెండుగా ఉన్న వ్యక్తుల్లో ఆయనొకరని రజనీ తెలిపారు. ప్రతిభ ఉంటే పేరుప్రతిష్ఠలతో పాటు అహంభావం కూడా దరిచేరుతుందని, కానీ, ఎమ్మెస్వీ మాత్రం అహంకారాన్ని దరిచేరనీయలేదని అన్నారు.