: ఐఎస్ మిలిటెంట్లను వేటాడుతున్న 'రాంబో'


ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూపు పట్ల ఆకర్షితులై ప్రపంచవ్యాప్తంగా ఎందరో స్వస్థలాలు వీడి ఇరాక్, సిరియా దేశాలకు వెళ్లడం చూశాం! కానీ, అయూబ్ అల్హే అల్ రుబాయి అనే వ్యక్తి మాత్రం ఐఎస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు కుటుంబాన్ని వదిలి ఓ షియా సంస్థలో చేరాడు. ఈ ఇరాక్ జాతీయుడు గతంలో ఓ యూనివర్శిటీలో లెక్చరర్ గా పనిచేశాడు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది. ఐఎస్ కిరాతకాల పట్ల ఆవేశం అతడిని తుపాకీ పట్టేలా పురిగొల్పింది. దృఢకాయుడు కావడంతో అందరూ అతడిని 'రాంబో' అని పిలుస్తారు. మిలిటెంట్ల వేటలో తుపాకీతో పాటు గొడ్డలి, కత్తులు ఉపయోగిస్తాడు. అవసరాన్ని బట్టి ఆయుధాలు వినియోగిస్తాడన్నమాట! ఇక, మనోడికి సోషల్ మీడియాలో విశేషమైన ఫాలోయింగు ఉంది. ఐఎస్ పై దాడులు చేసిన వెంటనే దాడి తాలూకు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తాడు. లక్షలాది మంది ఫాలోవర్లున్నారు రాంబోకి. అతడికి సంబంధించిన వార్తలను అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాల పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తాయి.

  • Loading...

More Telugu News