: మెమన్ కు ఉరే సరి... పిటిషన్ కొట్టేసిన సుప్రీం


1993లో ముంబైలో పేలుళ్లకు కుట్ర జరిపి 250 మంది ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఘటనలో దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై స్టే విధించలేమని సుప్రీంకోర్టు కొద్ది సేపటి క్రితం స్పష్టం చేసింది. ఈ కేసులో గతవారం మెమన్ పెట్టుకున్న పిటిషన్ ను సుదీర్ఘంగా విచారించిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు తీర్పును ప్రకటించింది. గత క్యూరేటివ్ పిటిషన్ పై ఏర్పాటైన ధర్మాసనం సరైన తీర్పునే ఇచ్చిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మరోదఫా ఇదే తరహా పిటిషన్ పై విచారించాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతో యాకూబ్ మెమన్ కు రేపు ఉరిశిక్ష ఖాయమైనట్టే. కాగా, ప్రస్తుతం మెమన్ పెట్టుకున్న తుది క్షమాభిక్ష పత్రాలు రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్నాయి. ఈ సాయంత్రంలోగా దానిపై ప్రణబ్ ముఖర్జీ సానుకూలంగా స్పందిస్తే మాత్రమే రేపు మెమన్ కు మరణదండన అమలు ఆగుతుంది.

  • Loading...

More Telugu News