: కలాం 'కొటేషన్'ను ఫేస్ బుక్ లో పెట్టిన అధికారిపై మండిపడ్డ కేరళ సర్కారు!
"నేను మరణిస్తే సెలవు ప్రకటించ వద్దు. అందుకు ప్రతిగా మరో రోజు అదనంగా పనిచేయండి. అలా చేస్తేనే నాకు మరింత ఆనందం"... మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మానవాళికి అందించిన ప్రముఖ కొటేషన్లలో ఇదొకటి. ఇదే కొటేషన్ ను తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన కేరళ చీఫ్ సెక్రటరీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం మండిపడింది. కలాంకు నివాళి అర్పించాలన్న ఉద్దేశంతో కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి థామ్సన్ ఈ కోట్ ను తన ఫేస్ బుక్ ఖాతాలో ఉంచారు. కలాం చెప్పిన విషయాన్ని ఆచరించాలని అన్నారు. దీనిపై మండిపడ్డ సీఎం క్యాంపు కార్యాలయం, ఇలా చెప్పడం సరికాదని, వెంటనే దాన్ని తొలగించాలని ఆదేశించింది.