: యాకుబ్ మెమెన్ ఉరిపై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు... కాసేపట్లో తుది తీర్పు


ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ యాకుబ్ మెమెన్ పెట్టుకున్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. శిక్షను కుదించాలంటూ మెమెన్ తరపు న్యాయవాది, ఉరిశిక్ష వేయాల్సిందే అంటూ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తమ వాదనలను గట్టిగా వినిపించారు. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వాదనలను విన్నది. కాసేపట్లో, ఈ పిటిషన్ కు సంబంధించి త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పును వెలువరించనుంది. రేపు ఉదయమే మెమెన్ కు ఉరిశిక్ష అమలు కానున్న నేపథ్యంలో, సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

  • Loading...

More Telugu News