: భారత్ పై దాడికి ఐఎస్ఐఎస్ సన్నాహాలు?


తన దుశ్చర్యలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు భారత్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తోందా? అంటే, అవుననే అంటోంది అమెరికా పత్రిక యూఎస్ఏ టుడే. ఓ పాకిస్థాన్ పౌరుడి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైందని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. భారత్ పై దాడికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న విషయం ఆ పత్రాల్లో ఉన్నదని, భారత్ వంటి దేశాలపై దాడులు చేయడం ద్వారా అగ్రరాజ్యం అమెరికాను రెచ్చగొట్టవచ్చన్నది ఐఎస్ వ్యూహంగా కనిపిస్తోందని యూఎస్ఏ టుడే వివరించింది. ప్రపంచదేశాలపై తాము దాడికి దిగితే, అమెరికా తన మిత్రపక్షాలతో కలిసి తమపై యుద్ధం ప్రకటిస్తుందని, దాంతో ముస్లింలందరూ ఏకమవుతారని ఐఎస్ భావిస్తున్నట్టు ఆ పత్రిక పేర్కొంది. ఆ పరిణామం అంతిమ యుద్ధానికి దారితీస్తుందని ఐఎస్ విశ్వసిస్తున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News