: మెమెన్ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానంలో కొనసాగుతున్న వాదనలు... కిక్కిరిసిన కోర్టు హాలు
ముంబై వరుస పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ మెమెన్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటోంది. మెమెన్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... ఏప్రిల్ 30న డెత్ వారంట్ ఇష్యూ అయితే, జులై 13న తమకు తెలియజేశారని చెప్పారు. మెమెన్ లాంగ్ టర్మ్ మెంటల్ డిజార్డర్ (స్కిజోఫ్రీనియా)తో బాధపడుతున్నాడని... అందువల్ల అతని శిక్షను కుదించాలని కోర్టును కోరారు. జైల్లో అతని మంచి ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. క్యూరేటివ్ పిటిషన్, రివ్యూ పిటిషన్ ఒకే విధంగా ఉన్నాయని, అందువల్ల వాదనలు అవసరం లేదని ఈ సందర్భంగా రోహత్గీ వాదించారు. అత్యంత తీవ్రమైన నేరంలో యాకుబ్ మెమెన్ కూడా ఒక కుట్రదారుడే అని అన్నారు. మెమెన్ కు విధించిన శిక్ష సరైనదే అని కోర్టుకు విన్నవించారు. ఈ వాదనల సందర్భంగా, కోర్టు హాలు కిక్కిరిసి పోయింది.