: రూ. 420 కోట్లు కట్టండి... హ్యందాయ్ పై పెనాల్టీ విధించిన భారత్


బహిరంగ మార్కెట్లో స్పేర్ పార్ట్స్ లభించేలా చూడనందుకు కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ పై రూ. 420 కోట్ల జరిమానా విధించింది. ఈ డబ్బును 60 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. మూడు సంవత్సరాల సరాసరి టర్నోవరుపై రెండు శాతం మొత్తాన్ని జరిమానాగా విధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, గత సంవత్సరం ఆగస్టులో 14 కార్ల తయారీ కంపెనీలపై మొత్తం రూ. 2,554 కోట్ల జరిమానాను సీసీఐ విధించగా, వీటిల్లో చాలా కంపెనీలు కోర్టులను ఆశ్రయించి జరిమానా ఆదేశాలపై స్టే తెచ్చుకున్నాయి. విచారణలో భాగంగా గతంలో జారీ చేసిన స్టేలను ఎత్తివేసిన కోర్టులు సీసీఐ జరుపుతున్న దర్యాప్తునకు సహకరించాలని సూచించాయి. కాగా, టాటా మోటార్స్ పై రూ. 1,346 కోట్లు, మారుతి సుజుకిపై రూ. 471 కోట్ల జరిమానా పడింది. ఇప్పుడు తాజాగా హ్యుందాయ్ పై కొత్త జరిమానా విధించడం గమనార్హం. కారు విడిభాగాలను మార్కెట్లో లభించకుండా చేసి, 28 నుంచి 644 శాతం అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సీసీఐ విచారణలో వెల్లడైంది.

  • Loading...

More Telugu News