: కలాంకు రోశయ్య ఘన నివాళి... రామేశ్వరానికి పార్థివ దేహం తరలింపు


భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఘన నివాళి అర్పించారు. కొద్దిసేపటి క్రితం మధురై విమానాశ్రయానికి చేరుకున్న కలాం భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛముంచి రోశయ్య శ్రద్ధాంజలి ఘటించారు. రోశయ్యతో పాటు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్ కూడా కలాం భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అనంతరం కలాం పార్థివ దేహాన్ని ప్రత్యేక హెలికాప్టర్ లో రామనాథపురం జిల్లాలోని ఆయన సొంతూరు రామేశ్వరానికి తరలించారు.

  • Loading...

More Telugu News