: సెప్టెంబర్ 1 నుంచి ఏపీ అసెంబ్లీ: యనమల
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమై ఉంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 20వ తేదీ లోపల ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశాలు వారం రోజుల పాటు జరగనున్నాయని చెప్పారు.