: యాకుబ్ ఉదంతంపై అట్టుడుకుతున్న ‘మహా’ అసెంబ్లీ... పలుమార్లు వాయిదా


ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ యాకుబ్ మెమన్ క్షమాభిక్ష పిటీషన్ పై మహారాష్ట్ర అసెంబ్లీ అట్టుడుకుతోంది. యాకుబ్ క్షమాభిక్ష పిటీషన్ కు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అధికార బీజేపీ, శివసేన ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. బాంబు పేలుళ్ల నిందితుడికి క్షమాభిక్ష ప్రసాదించమని ఎలా కోరతారంటూ నిలదీశారు. అధికార పక్షం దాడికి కాంగ్రెస్ సభ్యులు కూడా దీటుగానే బదులిస్తున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభా వ్యవహారాలకు ఆటంకం ఏర్పడటంతో ఇప్పటికే పలుమార్లు సభను స్పీకర్ వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News