: సీన్ రివర్స్... కోడలు వేధింపులపై కొడుకు దుకాణం ముందు మహిళ ఆందోళన!
అత్తింటి ఆరళ్లు తాళలేక ఆందోళనకు దిగిన యువతులను చూశాం. అయితే అనంతపురం జిల్లా కదిరిలో ఇందుకు పూర్తి వ్యతిరేకంగా రివర్సైన సీన్ ప్రత్యక్షమైంది. కొడుకు భార్య హోదాలో ఇంటిలో అడుగుపెట్టిన ఓ కోడలు తన అత్తను వేధింపులకు గురి చేసిందట. దీంతో ఆ వేధింపులను తట్టుకోలేక సదరు మహిళ, ఏకంగా తన కొడుకు దుకాణం ముందు నడి బజారులో ఆందోళనకు దిగింది. కదిరిలోని ఎంజీ రోడ్డుకు చెందిన గోవిందమ్మ, కోడలు వేధింపులు తాళలేక తన కొడుకు భాస్కరాచారి నిర్వహిస్తున్న నగల దుకాణం నిహారిక జ్యువెల్లర్స్ ముందు నిరసన వ్యక్తం దిగింది.