: తెలివిమంతులే ఎక్కువ కాలం జీవిస్తారట!... తేల్చేసిన తాజా అధ్యయనం


ఇతరులతో పోలిస్తే తెలివిమంతులు ఎక్కువ కాలం జీవిస్తారట. ఇందుకు వారిలోని ‘తెలివి’ జన్యువులే కారణమని తాజాగా జరిగిన ఓ అధ్యయనం చెబుతోంది. మనిషిలోని తెలివితేటలకు జన్యువులే కారణమని ఇదివరకటి అధ్యయనాల్లో శాస్త్రవేత్తలు తేల్చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన అధ్యయనంలో ఈ ‘తెలివి’ జన్యువుల కారణంగానే ఇతరులతో పోలిస్తే, తెలివిమంతులు ఎక్కువ కాలం బతుకుతారని తేలింది. అమెరికా, స్వీడన్, డెన్మార్క్ లకు చెందిన కవలలు, కవలలు కాని వారిపై లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్ పరిశోధకులు చేసిన అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారించింది. కవలలు అన్ని రకాల జన్యువులను పంచుకుంటుండగా, కవలలు కాని సోదరులు సగం జన్యువులను మాత్రమే పంచుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది. ఐక్యూ (ఇంటెలిజెంట్ కోషియంట్) అధికంగా ఉండే పిల్లలు మిగిలిన వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రోసాల్డిన్ ఆర్డెన్ తెలిపారు. ఇలాంటి వారు ఉద్యోగ జీవితంలోనూ ఇతరులకంటే ఉన్నత స్థానాల్లో ఉంటారని కూడా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News