: ఉస్మానియా ఆసుపత్రి తరలింపు ప్రక్రియ ప్రారంభం


హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రి తరలింపు ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలైంది. ఇప్పటికే ఆసుపత్రిలోని మూడు ఆర్థోపెడిక్ విభాగాల్లో రెండింటిని కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. ఇక మెటర్నిటీ విభాగాన్ని దశలవారీగా పేట్లబురుజు ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. దశాబ్దాల కిందట నిర్మించిన ఉస్మానియాలోని చాలా భవంతులు కూలిపోయే దశకు చేరుకున్నాయి. ఇటీవల ఆసుపత్రిని పరిశీలించిన సీఎం కేసీఆర్ వారం రోజుల్లోగా తరలిస్తామని, వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News