: మధురై చేరుకున్న కలాం పార్థివ దేహం... మరికాసేపట్లో రామేశ్వరంకు తరలింపు


భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతిక కాయం కొద్దిసేపటి క్రితం తమిళనాడులోని మధురైకి చేరుకుంది. నేటి ఉదయం ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరిన కలాం పార్థివ దేహం మధురై చేరుకుంది. మధురై విమానాశ్రయంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య తదితరులు కలాం భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ లో రామనాథపురం జిల్లాలోని కలాం సొంతూరు రామేశ్వరంకు ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తారు.

  • Loading...

More Telugu News