: ఇండిగో, జెట్ ఎయిర్ వేస్ బాటలో స్పైస్ జెట్... రూ.999లకే ప్రయాణం


ప్రయాణికులను ఆకట్టుకునేందుకు పలు ఎయిర్ లైన్స్ సంస్థలు డిస్కౌంట్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇండిగో, జెట్ ఎయిర్ వేస్ బాటలో స్పైస్ జెట్ కూడా వర్షాకాల డిస్కౌంట్ ప్రకటించింది. ఎకనామీ క్లాస్ లో రూ.999ల ఛార్జీతోనే ప్రయాణించవచ్చని తెలిపింది. మూడు రోజుల పాటు ఉండే టికెట్ అమ్మకాలు ఈరోజు నుంచి మొదలై రేపు అర్ధరాత్రి వరకు ఉంటాయని చెప్పింది. బెంగళూరు-కొచ్చి, ఢిల్లీ-ఉదయ్ పూర్, కోల్ కతా-అగర్తలా, పూణె-గోవా, అమృత్ సర్-శ్రీనగర్, హైదరాబాద్-గోవా, ముంబయి-బెల్గం, కోల్ కతా-గౌహతి, చెన్నై-వైజాగ్, తదితర ప్రాంతాలకు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. ఈ టికెట్ పై ఆగస్టు 4 నుంచి అక్టోబర్ 15 వరకు బుక్ చేసుకున్న ప్రాంతానికి ప్రయాణించవచ్చు. అయితే ఈ డిస్కౌంట్ కింద ఒకసారి బుక్ చేసుకున్న తరువాత డబ్బు తిరిగివ్వబోమని స్పైస్ జెట్ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News