: ఉరిశిక్షకు ఒక్కరోజు ముందు... రాష్ట్రపతికి మరోసారి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న మెమెన్


ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమెన్ ను రేపు ఉదయం నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరితీయనున్నారు. మరోవైపు, ఉరి శిక్షను నిలుపుదల చేయాలంటూ మెమెన్ పెట్టుకున్న పిటిషన్ పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనంలో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో, తనకు క్షమాభిక్ష పెట్టాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈరోజు యాకుబ్ మెమెన్ మరోసారి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. గతంలో, మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను 2014 ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ క్రమంలోనే ఆయనకు ఉరిశిక్ష ఖరారయింది. దీంతో, ఇప్పటికే క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించినందున... ప్రస్తుత పిటిషన్ ను రాష్ట్రపతి మరోసారి పరిశీలించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు తుది తీర్పుపైనే మెమెన్ భవితవ్యం ఆధారపడి ఉంది. మెమెన్ కు ఉరా? ఊపిరా? అనే విషయం కాసేపట్లో తేలిపోనుంది.

  • Loading...

More Telugu News