: సింగపూర్ లో భార్య తల నరికిన భారతీయుడు... రెండున్నరేళ్లకు ఇంటర్ పోల్ సహకారం కోరిన అధికారులు


డిసెంబర్ 2013లో సింగపూర్ లోని వాంపోవా నదిలో ఓ తలలేని మహిళ మృతదేహం కనిపించి సంచలనం సృష్టించింది. ఈ కేసులో మృతదేహం జస్విందర్ కౌర్ (33) దని గుర్తించిన పోలీసులు, రెండున్నరేళ్ల పాటు దర్యాప్తు జరిపి, ఆమె భర్త హర్వీందర్ కౌర్ (35) నిందితుడని తేల్చారు. అతన్ని పట్టుకోవడం కోసం ఇంటర్ పోల్ సహకారాన్ని కోరారు. ఆమె హత్య డిసెంబర్ 11, 2013న జరిగిందని కోర్టుకు తెలిపిన పోలీసులు శరీరం నుంచి జస్విందర్ తల, చేతులు తెగ్గోశారని పేర్కొన్నారు. ఘటన జరిగిన రెండో రోజే హర్వీందర్ తొలుత మలేషియాకు, అక్కడి నుంచి ఇండియాకు పారిపోవడంతో హత్యకు గల సరైన కారణాలను కనుగొనలేకపోయామని దర్యాప్తు బృందం కోర్టుకు తెలిపింది. ఈ కేసులో నిందితుడికి సహకరించాడన్న ఆరోపణలపై మరో భారతీయుడు గురుశరణ్ సింగ్ అనే యువకుడు 30 నెలలుగా జైల్లో ఉన్నాడు. కేసులో మృతదేహం విడిభాగాలు లభ్యం కాకపోవడం, నిందితుడు తప్పించుకు పారిపోవడంతో కేసు విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. ఇంటర్ పోల్ సాయంతో నిందితుడిని పట్టుకుంటామన్న ఆశాభావాన్ని సింగపూర్ పోలీసులు వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News