: ఇద్దరు భారతీయులకు రామన్ మెగసెసె పురస్కారం
ఇద్దరు భారతీయులకు అరుదైన గౌరవం లభించింది. ఎయిమ్స్ డిప్యూటీ సెక్రెటరీ సంజీవ్ చతుర్వేది, గూంజ్ స్వచ్ఛంధ సంస్థ వ్యవస్థాపకుడు అన్షుగుప్తాలకు 2015 సంవత్సరానికిగానూ రామన్ మెగసెసె అవార్డులు ప్రకటించారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ప్రతియేటా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటిస్తుంది.