: నాగార్జున వర్సిటీకి విచారణ కమిటీ... రిషికేశ్వరి మృతిపై విచారణ ప్రారంభం


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్యపై ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ విచారణను ప్రారంభించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ కొద్దిసేపటి క్రితం వర్సిటీకి చేరుకుంది. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు వర్సిటీలో ఉంటామని చెప్పారు. అధ్యాపకులు, హాస్టళ్ల ఇన్ చార్జీలు, రిషికేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడి మూడు రోజుల్లోగా విచారణ పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. అంతేకాక ఈ-మెయిళ్ల ద్వారా విద్యార్థుల అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. ఈ మొత్తం విషయాలను క్రోడీకరించి రూపొందించే నివేదికను ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News