: ఇసుక మాఫియా ద్వారా అచ్చెన్నాయుడుకు నెలకు కోటి అందుతోంది: ధర్మాన తీవ్ర ఆరోపణ
ఏపీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇసుక మాఫియా ద్వారా అచ్చెన్నాయుడుకు నెలకు కోటి రూపాయలు ముడుతున్నాయని ఆయన ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు ఇసుక ర్యాంపులు ఇస్తామని చెబుతూనే, టీడీపీ కార్యకర్తలకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఇసుక దందాపై వైకాపా తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ప్రభుత్వానికి... ఈ ఆరోపణలు కొంచెం ఇబ్బందిని కలిగించేవే.