: కలాం అంత్యక్రియలకు గైర్హాజరవుతున్న జయలలిత... ఆరోగ్యం సహకరించడం లేదన్న 'అమ్మ'


తమిళనాడులోని రామేశ్వరంలో రేపు మధ్యాహ్నం జరగనున్న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత గైర్హాజరవుతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. అంత్యక్రియలకు హాజరుకావాలని ఉన్నప్పటికీ... తన ఆరోగ్యం సహకరించని కారణంగానే వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. తన తరపున మంత్రి పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులందరూ అంత్యక్రియలకు హాజరవుతారని జయ చెప్పారు. కలాం కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన అంత్యక్రియలకు స్థలం కేటాయించామన్నారు. కాగా కలాం మృతికి సంతాప సూచకంగా రేపు తమిళనాడులో సెలవు ప్రకటించారు. చెన్నైకి 600 కిలో మీటర్ల దూరంలో ఉన్న రామేశ్వరంలోని కలాం ఇంటికి సమీపంలోని మసీదు పక్కనున్న స్థలంలో ఖననం చేయనున్నారు.

  • Loading...

More Telugu News