: సోషల్ మీడియాలో కొత్త హీరో... పోలీసు ఎదురుపడితే, ఆ చిన్ని గుడ్లగూబ ఏం చేసిందో తెలుసా?
ఓ చిన్న గుడ్లగూబ... తల్లి నుంచి వేరుపడింది. రోడ్డుపైకి వచ్చింది. తన చేష్టలతో సామాజిక మాధ్యమాల్లో హీరోగా నిలిచింది. 32 లక్షల మందికి నచ్చేసింది. వివరాల్లోకి వెళ్లితే, అమెరికాలోని కోలరాడా పరిధిలో బౌల్డర్ కౌంటీ పోలీసు విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ చేస్తుంటే, రోడ్డుపై ఓ చిన్న గుడ్లగూబ పిల్ల కనిపించింది. దాని దగ్గరకు సోఫీ బెర్నమ్ అనే ఆ మహిళా పోలీసు వెళితే, వింతగా చూసింది. ''వాట్స్ అప్?'' అని అడిగితే, తల అటూ ఇటూ తిప్పింది. సెల్యూట్ చేస్తున్నట్టు పలుమార్లు నడుం వంచింది. ఈ దృశ్యాలన్నీ ఆ పోలీసు ధరించిన బటన్ కెమెరాలో రికార్డయ్యాయి. దీన్ని సోషల్ మీడియాలో ఉంచితే 32 లక్షల మంది తిలకించారు. ఆ గుడ్లగూబ పిల్లకు సెలబ్రిటీ హోదా వచ్చేసింది. "ఈ బేబీకి అడ్డంగా వెళితే, ఆసక్తికరంగా తల అటూ ఇటూ తిప్పింది. ఆపై సురక్షితంగా వెళ్లిపోయింది" అంటూ, బౌల్డర్ కౌంటీ షరీఫ్ అధికార ట్విట్టర్ పేజీలో వీడియోను, ఫోటోలను పెట్టారు. ఆ వీడియోను మీరు చూడాలంటే... https://www.youtube.com/watch?v=4J3lPssz1Ms