: తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభం... అడ్డుకున్న విద్యార్థి సంఘాలు


తెలంగాణలోని మెడికల్ కళాశాలల్లోని సీట్ల భర్తీ ప్రక్రియ (కౌన్సిలింగ్) కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. హైదరాబాదులో రెండు, వరంగల్ లో ఒక కౌన్సిలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించింది. తొలి రోజు కౌన్సిలింగ్ కు ఓసీ కేటగిరీలో 1 నుంచి 6 వేల ర్యాంకు వరకు, రిజర్వేషన్ కేటగిరీలో 1 నుంచి 16 వేల వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులు హాజరుకావాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే, కౌన్సిలింగ్ ను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. భారీగా పెరిగిన మెడికల్ ఫీజులను తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు కూకట్ పల్లిలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగాయి. దీంతో ప్రారంభమైన వెంటనే కౌన్సిలింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత రంగప్రవేశం చేసిన పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News